వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 88 స్థానాలకు గానూ 87 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఒక్క తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానానికి ఈ నెల 5న పోలింగ్ నిర్వహించనున్నారు.
తాళ్లమాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు బూత్‌లు, మూలవారిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక బూత్ ఏర్పాటు చేశారు. మొత్తం 3,708 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ జనసేన, స్వతంత్ర అభ్యర్థి మధ్య పోటీ నెలకొంది.
Comments
Loading comments...

