Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు పిహెచ్ సి సమస్యలపై సర్వసభ్య సమావేశం లో చర్చించాలి

Follow Udayam on Google
Jaipal Sep 24, 2026 6:24 PM నాగర్ కర్నూల్తెలంగాణ
తాడూరు పిహెచ్ సి సమస్యలపై సర్వసభ్య సమావేశం లో చర్చించాలి - Udayam
తాడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్‌సీలో నెలకొన్న సమస్యలపై రాబోయే మండల సర్వసభ్య జనరల్ బాడీ సమావేశంలో కూలంకషంగా చర్చించి, తగిన పరిష్కారం చూపాలని సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తాడూరు పీహెచ్‌సీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వైద్య సేవల పరిస్థితి, సిబ్బంది కొరత, అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్చించారు.

Comments

G
Loading comments...