Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రిలో బకాయిల వ్యవహారంపై ఆరుగురిపై కేసు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 11:02 AM అనంతపురంGeneral
తాడిపత్రిలో బకాయిల వ్యవహారంపై ఆరుగురిపై కేసు - Udayam
తాడిపత్రిలో లారీ బాడుగల బకాయిలు చెల్లించకుండా మోసం చేశారన్న ఫిర్యాదుతో ఆరుగురిపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీ చేతన సాయి లాజిస్టిక్స్ సంస్థకు 24 మంది లారీ యజమానులు లారీలను లీజుకు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.70 లక్షల బకాయిల్లో రూ.21 లక్షలు మాత్రమే చెల్లించి, ఇంకా రూ.49.35 లక్షలు చెల్లించలేదని ఆరోపించారు. బకాయిలు అడిగితే బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...