Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండలో రౌడీషీటర్లకు సీఐ ఉమేష్ తీవ్ర హెచ్చరిక

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 16, 2026 5:55 PM గుంటూరుGeneral
తాడికొండలో రౌడీషీటర్లకు సీఐ ఉమేష్ తీవ్ర హెచ్చరిక - Udayam
తాడికొండ మండల పరిధిలోని రౌడీషీటర్లకు శనివారం సీఐ ఉమేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్రమ లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, గొడవలు సృష్టించి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...