వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిచెర్ల గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. మేనంపల్లి, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, సమ్మయ్యపల్లె తదితర ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు.
ముఖ్యంగా వృద్ధులు అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారని పేర్కొన్నారు. కోతుల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

