వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలోని సలాం సెంటర్‌లో బుధవారం ఓ యువకుడు కత్తి పట్టుకుని హల్‌చల్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సొంత అన్నదమ్ముల మధ్య చెలరేగిన గొడవే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. చేతిలో కత్తితో యువకుడు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. గొడవకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

