Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం బడిలో భోజనం తనిఖీ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:46 PM పశ్చిమగోదావరి General
తాడేపల్లిగూడెం బడిలో భోజనం తనిఖీ - Udayam
తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా ఆహార తనిఖీ అధికారి ప్రణీత్‌కుమార్‌ తనిఖీ చేశారు. పాఠశాలలో ఆహార నాణ్యత సంతృప్తికరంగా ఉందని తెలిపారు. వంటకాల నాణ్యతను యథావిధిగా కొనసాగించాలని, ఆహారం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తనిఖీల్లో హెచ్‌ఎం మైనం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...