వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఐటీఎస్ ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యాన్ని అధికారులు వారికి వివరించారు.
Comments
Loading comments...

