Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి రవాణాపై నిఘా

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 11:08 AM పెద్దపల్లి తెలంగాణ
గంజాయి రవాణాపై నిఘా - Udayam Digital
జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు నిఘా మరింత పటిష్ఠం చేశారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తూ ఈ ఏడాది 128 కేసులు నమోదు చేసి 129 కిలోల గంజాయి, 21 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అయినా మత్తుకు అలవాటుపడిన కొందరు చిన్న ప్యాకెట్ల రూపంలో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారుల్లో అవగాహన పెంపుతోనే సమస్యను సమర్థంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...