వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కొలీజియం నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూనియర్ల పేర్లు ప్రతిపాదించారంటూ న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియం కార్యకలాపాలపై తాము ఎటువంటి సూచనలు ఇవ్వబోమని జస్టిస్ నాగరత్న, జస్టిస్ బాగ్చీ ధర్మాసనం పేర్కొంది. న్యాయవ్యవస్థ నియామకాల్లో జోక్యం సమస్యలకు దారితీస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
Comments
Loading comments...

