వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో కింది కోర్టు విధించిన శిక్షపై దాఖలైన అప్పీలును విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు 41 ఏళ్ల అసాధారణ జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి సుదీర్ఘ ఆలస్యాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయని, కేసులు తగ్గించేందుకు ఎలాంటి వినూత్న చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టును ప్రశ్నించింది.
యూపీకి చెందిన విజయ్ సింగ్ 1985లో యావజ్జీవ శిక్ష పడగా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆ అప్పీల్ కొట్టివేయబడింది. ఈ 43 ఏళ్లలో అతను కేవలం మూడు నెలలు మాత్రమే జైల్లో ఉన్నాడని గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం, ప్రస్తుత విచారణ నేపథ్యంలో అతని బెయిల్‌ను కొనసాగించింది.
Comments
Loading comments...

