Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో ఘోర ప్రమాదం: ఒకరి మృతి

Follow Udayam on Google
S kumar Sep 18, 2026 3:36 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి: మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గురువారం మినీ బస్సు, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరుకు చెందిన మోరి శంకర్ తన కూతురిని తీసుకెళ్లేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా పోలీసులు మృతుడిని గుర్తించి, దేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...