వార్తలకు తిరిగి వెళ్లండి
సుద్దులం ఉల్లాస్–నవభారత అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఆదివారం సుద్దులం గ్రామంలో ‘అమ్మకు అక్షరమాల’ పరీక్ష నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తినేటి హేమలత లక్ష్మణ్ మహిళలకు పరీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ హేమలత మాట్లాడుతూ మహిళలు అక్షరాస్యత సాధించడం ద్వారా తమ కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరన్నారు. కార్యక్రమంలో సీఈఓ సంధ్య, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

