వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి వీజీ గౌడ్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి తోట ఆగయ్యతో పాటు పలు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

