Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుబ్బారెడ్డి నగర్ రోడ్డు ఎక్కిన మురుగునీరు

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:52 PM గుంటూరుక్రీడలు
సుబ్బారెడ్డి నగర్ రోడ్డు ఎక్కిన మురుగునీరు - Udayam
గుంటూరు శివారు 25వ డివిజన్ సుబ్బారెడ్డి నగర్లో అస్తవ్యస్త పారిశుద్ధ్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని రోడ్లకు ఒకవైపే సైడ్ కాలువలు నిర్మించి, రెండోవైపు వదిలేయడం, రోడ్లు పల్లంగా ఉండటంతో మురుగునీరు కాలువల్లోకి పారడం లేదు. ఫలితంగా మురుగు రోడ్లపైనే నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...