Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేక్‌ రషీద్‌ భారీ సెంచరీ.. పంజాబ్‌తో ఆంధ్ర మ్యాచ్‌ డ్రా

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 7:10 PM జాతీయంక్రీడలు
షేక్‌ రషీద్‌ భారీ సెంచరీ.. పంజాబ్‌తో ఆంధ్ర మ్యాచ్‌ డ్రా - Udayam
రంజీ ట్రోఫీ-2027లో గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ (176) భారీ సెంచరీతో మెరిశాడు. పంజాబ్‌తో జరిగిన ఎలైట్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలుత పంజాబ్‌ 9 వికెట్లకు 592 పరుగులు చేసి డిక్లేర్‌ చేయగా.. ఆంధ్ర 8 వికెట్ల నష్టానికి 505 పరుగులు సాధించింది. రషీద్‌తో పాటు కరణ్‌ షిండే (73 నాటౌట్‌) రాణించాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర రెండింట ఓడి, మరో రెండింటిని డ్రా చేసుకుంది.

Comments

G
Loading comments...