వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన ఇంటర్ విద్యార్థి వెస్లీ పాల్ (19) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదువులో ఆశించిన ఫలితాలు రాక మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తండ్రి ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

