వార్తలకు తిరిగి వెళ్లండి

పెదగుమ్ములూరు జడ్పీ హైస్కూల్ 7వ తరగతి విద్యార్థిని కిల్లాడ హిమబిందు రాష్ట్రస్థాయి టైక్వాండోలో గోల్డ్‌మెడల్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది. తెనాలిలో జరిగిన బాలికల సబ్‌జూనియర్ 22 కేజీల విభాగంలో ఆమె ప్రతిభ చూపించింది.
హిమబిందును ప్రధానోపాధ్యాయిని సుధామాధురి, ఉపాధ్యాయులు అభినందించి సత్కరించారు. టైక్వాండోతో ఆత్మరక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని హెచ్‌ఎం తెలిపారు.
Comments
Loading comments...

