Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్‌ వైద్య సేవలను బలోపేతం చేయాలి: కలెక్టర్‌

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 12, 2026 6:40 PM కోనసీమGeneral
ఆయుష్‌ వైద్య సేవలను బలోపేతం చేయాలి: కలెక్టర్‌ - Udayam
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆయుష్‌ వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్. మహేష్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో వైద్యశాలలు, డిస్పెన్సరీల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. ఆయుష్‌ వైద్య విధానాల ద్వారా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...