Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు స్టే

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 12, 2026 9:56 PM హైదరాబాద్General
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు స్టే - Udayam
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా పథకాలను అమలు చేస్తున్నారంటూ న్యాయవాది విజయ్‌ గోపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించినా నాలుగు వారాలైనా స్పందించలేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. దీంతో పథకాలపై స్టే విధించిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...