Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహ ఏర్పాటుపై వివాదం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 23, 2026 10:46 AM వరంగల్General
విగ్రహ ఏర్పాటుపై వివాదం - Udayam
ఖిలావరంగల్‌ మండలంలోని బొల్లికుంటలో అంబేడ్కర్‌ విగ్రహం పక్కనే శివాజీ మహరాజ్‌ విగ్రహ ఏర్పాటుపై ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. భూమి పూజ జరిగిన చోటే విగ్రహం ప్రతిష్ఠించాలని హిందూ సంఘాలు పట్టుబట్టగా, దళిత సంఘాలు దాన్ని అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...