Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 22, 2026 3:51 PM నాగర్ కర్నూల్General
రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలు ప్రారంభం - Udayam
వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఎస్పీ పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించడమే అసలైన క్రీడాస్ఫూర్తి అని విద్యార్థులకు సూచించారు.

Comments

G
Loading comments...