Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 2:42 PM జాతీయంGeneral
మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట - Udayam
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా తొక్కిసలాట జరిగింది. బారికేడ్లలో విద్యుత్‌ ప్రసారం అవుతోందన్న వదంతితో భక్తులు పరుగులు తీయడంతో 13 మంది గాయపడ్డారు. నాగచంద్రేశ్వర స్వామి వార్షిక దర్శనాల కోసం భారీగా భక్తులు తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...