సర్పంచ్ బరిలో మంత్రి భార్య

నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఏపీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు.
బనగానపల్లెను అభివృద్ధిలో ఆదర్శ పంచాయతీగా నిలపడమే తన లక్ష్యమని ఇందిరారెడ్డి తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
