Udayam Digital
Menu

అన్నేరావుపేట అడవిలో పెద్దపులి

Sai Nath Nov 19, 2026 3:08 PM అమరావతిGeneral
అన్నేరావుపేట అడవిలో పెద్దపులి - Udayam Digital
ఆంధ్రా–తెలంగాణ సరిహద్దుల్లో కొన్ని నెలలుగా సంచరిస్తున్న పెద్దపులి గురువారం ఉదయం నాటికి ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట అడవిలోకి చేరింది. బుధవారం రమణక్కపేట నుంచి సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి వెళ్లింది. పులి కదలికలను అటవీ అధికారులు ట్రాక్‌ చేస్తున్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది.

Comments

G
Loading comments...