జగన్ కేసులపై హైకోర్టులో విచారణ

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులను త్వరగా తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. 15 ఏళ్లుగా కేసులు కొనసాగుతున్నాయని, 150కి పైగా డిశ్ఛార్జ్ పిటిషన్లు ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కేసులను రోజువారీగా విచారించాలని హరిరామజోగయ్య తరఫు న్యాయవాది కోరారు. జగన్ తరఫు న్యాయవాది దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తదుపరి విచారణను నవంబర్ 30కి హైకోర్టు వాయిదా వేసింది.
Comments
Loading comments...
