ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 24న వాటిని పరిశీలిస్తారు. 27న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది.
డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
Comments
Loading comments...
