వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1,600 సోలార్ ఇన్‌స్టాలేషన్ల లక్ష్యం ఉండగా, పుట్టపర్తి, కదిరి 500 చొప్పున, హిందూపురం 600 లక్ష్యంగా నిర్దేశించారు.
పథకం అమలులో ఆశించిన పురోగతి లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎం కుసుమ్ పథకం అమలును కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

