Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా డిజిటైజేషన్ వేగవంతం చేయాలి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 25, 2026 6:12 PM జోగులాంబ గద్వాల్ General
ఓటర్ల జాబితా డిజిటైజేషన్ వేగవంతం చేయాలి - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డిజిటైజేషన్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆగస్టు 3వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...