వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ను విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. టీటీడీలో దివ్యాంగ భక్తులకు సులభతరమైన ప్రత్యేక దర్శనాలు కల్పించాలని కోరారు.
భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను మాధవ్ దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు, వాటి పరిష్కారానికి టీటీడీ అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

