Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడుపాయల దర్శనానికి ప్రత్యేక బస్సు ప్రారంభం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 1:06 PM పెద్దపల్లి General
ఏడుపాయల దర్శనానికి ప్రత్యేక బస్సు ప్రారంభం - Udayam
గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి ఏడుపాయల వనదుర్గాదేవి దర్శనానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును శుక్రవారం ప్రారంభించారు. డిపో మేనేజర్ కవిత జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ యాత్రలో భక్తులు ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంతో పాటు సిద్దిపేట కోమటి చెరువును సందర్శించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఇలాంటి ప్రత్యేక యాత్రలను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...