Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 14, 2026 10:17 AM ఏలూరుGeneral
స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన - Udayam
ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, పోలీస్ కవాతు రిహార్సల్స్‌ను ఎస్పీ ప్రతాప్ కిషోర్ శుక్రవారం పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. మైదాన పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్, ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...