వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఎస్పీ నితికా పంత్ శుక్రవారం పరిశీలించారు. పరేడ్‌లో పాల్గొనే సిబ్బంది రిహార్సల్స్‌ను పరిశీలించారు.
కవాతు, క్రమశిక్షణ, సమన్వయం, సమయపాలనపై సిబ్బందికి సూచనలు చేశారు. వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

