వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రూరల్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు గౌడ్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ సునీత ఆయనను, ఆయన సతీమణిని పూలమాల, శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
వెంకటేశ్వర్లు గౌడ్ విశిష్ట సేవలను ఎస్పీ కొనియాడారు. పోలీస్ ఉద్యోగం ఉపాధి మాత్రమే కాదని, సమాజ భద్రత కోసం చేసే త్యాగమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

