వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి మండలం కేతగాని చెరువు సచివాలయం పరిధిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాలను నిర్వహించారు. సూపర్‌వైజర్ శుభారాణి ఆధ్వర్యంలో ఆహార వైవిధ్యం, తగినంత ప్రోటీన్ ప్రాముఖ్యతపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.
వివిధ పోషకాహార పదార్థాలతో ఫుడ్‌స్టాల్ ఏర్పాటు చేశారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

