Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి హత్య కేసులో కుమారుడి అరెస్ట్‌

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 06, 2026 11:45 AM పెద్దపల్లి General
తండ్రి హత్య కేసులో కుమారుడి అరెస్ట్‌ - Udayam
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో సింగరేణి విశ్రాంత ఉద్యోగి మాధయ్య(70) హత్య కేసులో కుమారుడు బాపురావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో బండరాయితో కొట్టి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. తండ్రితో ఉంటున్న బాపురావు తరచూ డబ్బుల కోసం వేధించేవాడని పోలీసులు వెల్లడించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...