వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 405 మంది విద్యార్థులకు శుక్రవారం కంటి పరీక్షలు నిర్వహించారు.
65 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచిత కళ్లద్దాలకు సిఫారసు చేశారు. మొబైల్ వినియోగాన్ని పరిమితం చేసి, సరైన వెలుతురులో చదవాలని వైద్యాధికారి డా.ఎస్.శ్రావణి సూచించారు. కార్యక్రమంలో ఆప్తాల్మిక్ అధికారి ఎం.ఆర్.కే.దాస్, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

