Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాలిలో 165 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు

Follow Udayam on Google
Raghu Sep 26, 2026 4:54 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
సంతబొమ్మాలిలో 165 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు - Udayam
సంతబొమ్మాలి మండలం భావనపాడు కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 165 మంది విద్యార్థులకు శనివారం కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆప్తాల్మిక్ అధికారి ఎం.ఆర్.కె. దాస్ కంటి పరీక్షలు చేశారు. 22 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచిత కళ్లద్దాలకు సిఫార్సు చేశారు. కంటి ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెచ్‌ఎం జనార్ధనరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...