Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాకిలి ఊడుస్తుండగా పాము కాటు.. మహిళ మృతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 9:48 AM అల్లూరి General
వాకిలి ఊడుస్తుండగా పాము కాటు.. మహిళ మృతి - Udayam
అల్లూరి జిల్లా వీఆర్‌పురం మండలం వడ్డీగూడెంకు చెందిన కోట్ల లక్ష్మీనరసమ్మ (60) పాము కాటుతో మృతి చెందారు. బుధవారం సాయంత్రం వర్షం తగ్గడంతో వీఆర్‌పురంలోని కుమార్తె ఇంటి వాకిలి ఊడుస్తుండగా పాము కాటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను రేఖపల్లి, కోతులగుట్ట ఆసుపత్రులకు తరలించి, మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...