Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 10:58 AM అనకాపల్లి General
సముద్రంలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు - Udayam
రాంబిల్లి వాడరాంబిల్లి బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మరో వ్యక్తి అలల్లో చిక్కుకోగా స్థానిక ఈతగాళ్లు రక్షించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. గోవిందపాలెం కార్మిక శిబిరం నుంచి బీహార్‌కు చెందిన 17 మంది బీచ్‌కు వెళ్లారు. బిపిన్‌కుమార్‌ను రక్షించేందుకు వెళ్లిన రంజిత్‌కుమార్ గల్లంతయ్యాడు. ఆయన కోసం గాలిస్తున్నట్లు సీఐ నర్సింగ్‌రావు తెలిపారు.

Comments

G
Loading comments...