Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం: సీఐటీయూ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:35 PM రాజన్న సిరిసిల్లGeneral
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం: సీఐటీయూ - Udayam
సిరిసిల్ల మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే గురువారం నుంచి సమ్మె చేపడతామని సీఐటీయూ నాయకుడు కోడం రమణ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ వైద్య సౌకర్యాలు, ప్రమాద బీమాను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని, పనిభారం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...