వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల నేపథ్యంలో సిద్ధిఖ్ తన అత్తింటివారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త నిరంజన్‌బీ, బావమరిది భార్య రేష్మా మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉండటంతో గాలిస్తున్నారు. ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు ఘటన జరిగిన రోజే పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
Comments
Loading comments...

