Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కరించాలని బీజేపీ కౌన్సిలర్ల వినతి

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 3:57 PM కామరెడ్డిGeneral
సమస్యల పరిష్కరించాలని బీజేపీ కౌన్సిలర్ల వినతి - Udayam
కామారెడ్డిలోని 49 వార్డుల్లో నెలకొన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్ల బృందం మున్సిపల్ కమిషనర్ పర్వతాలకు వినతిపత్రం అందజేసింది. పట్టణంలోని పలు వార్డుల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వార్డుల వారీగా సమస్యలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...