వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు విమర్శించారు.
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిర్వహించే సమరభేరి నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజల మద్దతుతో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

