Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ రేషన్‌కార్డుకు భద్రత

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 14, 2026 8:55 AM హైదరాబాద్General
స్మార్ట్‌ రేషన్‌కార్డుకు భద్రత - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను తొమ్మిది ఆధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించింది. బ్యాంకు నోట్లు, పాస్‌పోర్టుల్లో ఉపయోగించే సాంకేతికతను వీటిలో వినియోగించింది. కార్డులో కుటుంబ యజమానిగా మహిళ పేరుతోపాటు రేషన్‌కార్డు నంబరు, చిరునామా, చౌకధరల దుకాణం వివరాలుంటాయి. కార్డును స్కాన్‌ చేయగానే లబ్ధిదారుల వివరాలను నిర్ధారించేలా భద్రతా ఫీచర్లు జోడించారు.

Comments

G
Loading comments...