వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘం పార్కులో వివోఏల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీ వెలుగు యానిమేటర్ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ స్కీం వర్కర్లను వర్కర్లుగా గుర్తించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 1న నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమంలో వివోఏలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

