Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీ విగ్రహంతో భారీ మోసానికి స్కెచ్‌

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 9:43 PM హైదరాబాద్General
లక్ష్మీ విగ్రహంతో భారీ మోసానికి స్కెచ్‌ - Udayam
నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని నమ్మించి భారీ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించిన ఆరుగురిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. గులాబీ రంగు రాయికి మహిమలున్నాయని కూడా ప్రచారం చేసినట్లు గుర్తించారు. కాటేదాన్‌ లక్ష్మీగూడలో నిందితులను పట్టుకున్న పోలీసులు నకిలీ విగ్రహం, గులాబీ రాయి, ఎర్టిగా వాహనం, ఐదు మొబైల్‌ ఫోన్లు, రసాయన ద్రావణాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...