వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు సకాలంలో నిర్మించుకోవాలని స్థానిక ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. శనివారం ఉదయం మండలంలోని అంకత్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను దశలవారీగా చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు ఉన్నారు.
Comments
Loading comments...

