వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో సెప్టెంబర్ 7న జరిగిన మైలపల్లి చంటి హత్య కేసులో 3 వారాలైనా పురోగతి లేదు. చంటి తల, మెడపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు తనకు ప్రాణభయం ఉందని సోదరికి చెప్పినట్లు సమాచారం.
మిస్టరీని ఛేదించేందుకు వన్హన్ పోలీసులు దర్యాప్తు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. 80 మందికిపైగా విచారించినా నిందితులపై స్పష్టమైన క్లూ లభించలేదు.
Comments
Loading comments...

