వార్తలకు తిరిగి వెళ్లండి

జరజాం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వరి పంటకు మంగళవారం డ్రోన్తో కషాయాలు పిచికారీ చేశారు. ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ ఆదేశాలతో 13 మంది రైతుల 21 ఎకరాల్లో జిల్లేడు ద్రావణం, దశపర్ని కషాయం పిచికారీ చేశారు.
పురుగులు, తెగుళ్ల నివారణతో పాటు కూలీ ఖర్చు తగ్గి, తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వల్ల సాగు ఖర్చు తగ్గుతుందని చెప్పారు.
Comments
Loading comments...

